పట్టణంలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో బుధవారం విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికుల ఆధ్వర్యంలో అధికారులను ఘనంగా సన్మానించారు. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ఇటీవల బదిలీపై వెళ్లిన రాజేంద్రప్రసాద్ కు విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు శాలువా, మెమొంటోలతో ఘనంగా సన్మనించారు. అలాగే అతని స్థానంలో వచ్చిన నూతన అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ మోహన్ ను మీటర్ రీడింగ్ కార్మికులు శాలువా, మెమొంటోతో ఘనంగా సన్మానించారు. గత ఆరు సంవత్సరాలుగా ఏఏఓ గా విధులు నిర్వహించి మీటర్ రీడింగ్ కార్మికులకు సహాయ సహకారాలు అందించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఏఓలు సంజీవ్,పొషెట్టి,ప్రకాష్,హరీష్,సూపర్వైజర్ శ్రావణ్, రీడింగ్ కార్మికులు గంగాధర్, రఫీ, యూసుఫ్, శేఖర్, అజయ్, రాజశేఖర్, వాజిద్, ఇనాయత్, రేవంత్, సాయి, సోను తదితరులు పాల్గొన్నారు.