శ్రీనివాస్ కు ఘన సన్మానం

Great tribute to Srinivasనవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 

నల్లగొండ జిల్లా పౌర సంబంధాల శాఖలో  పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించి, ఇటీవలే సీనియర్ అసిస్టెంట్ పదోన్నతి పొంది బదిలీపై  సూర్యపేట డిపిఆర్ఓ కార్యాలయానికి వెళ్ళిన సినియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ కు గురువారం  జిల్లా పౌర సంబంధాల శాఖ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ కార్యాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, యాదయ్య, రేణుక, కొండమ్మ, పర్వీన్, పలువురు పత్రిక విలేకరులు పాల్గొన్నారు.