
రెంజల్ మండలం కూనేపల్లి జిల్లా పరిషత్ పాఠశాల, ప్రైమరీ పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిపారు. గత కొన్ని సంవత్సరాలుగా తమ పిల్లలకు ఉత్తమ విద్యను అందించి బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులకు తమ వంతు బాధ్యతగా వారికి సన్మానం చేయడం జరిగిందని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ గౌసుద్దీన్, నోడల్ అధికారి ఆంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నీరడీ సాయిలు, శ్రీనివాస్ గౌడ్, లింగం, మల్లేష్, గంగా నరసయ్య, గ్రామ కార్యదర్శి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.