అత్యాశే కొంపముంచుతోంది

Greed is consuming– సైబర్‌ నేరస్థుల నుంచి అప్రమత్తతే ఆయుధం
– గోల్డెన్‌ అవర్‌లో ఫిర్యాదు చేస్తే ఉపయోగం
– కమీషన్లపై లక్షలాది బ్యాంక్‌ అకౌంట్లు సేకరిస్తున్న నేరస్థులు
– సైబర్‌క్రైమ్‌ నేరాలపై మీడియా ప్రతినిధులకు జాయింట్‌ సీపీ అవగాహన
– సూచనలు.. సలహాలందించిన జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌, డీసీపీ కవిత
నవతెలంగాణ-సిటీబ్యూరో
పూర్వం గ్రామ శివార్లలో దారి దోపిడీలు జరి గేవి.. ఇండ్ల తాళాలు పగులగొట్టి నగదు, బంగారు, వెండి ఆభరణాలు, విలువై వస్తువులు ఎత్తుకెళ్లేవారు.. కానీ, హైటెక్‌ యుగంలో ఒకరికి తెలియ కుండా ఒకరు చేతులారా కోట్లాది రూపాయలు పోగొట్టుకుం టున్నారు. ఐటీ ఉద్యోగులు, ఉన్నత స్థానంలో ఉన్నవారితోపాటు వ్యాపారులు, సినీ ప్రముఖులు ఇలా వారు వీరనే తేడా లేకుండా సైబర్‌ నేరస్థులకు చిక్కి మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సైబర్‌ నేరాలపై నగర సీసీఎస్‌లో ప్రతి రోజూ 15కుపైగా కేసులు నమోదవుతున్నాయి. బాధితులు కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటు న్నారు. సైబర్‌ నేరాల నివారణకు జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ ప్రతి ఒక్కరికీ సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు కసరత్తు మొదలు పెట్టారు. గురువారం బషీర్‌బాగ్‌లోని పాత పోలీస్‌ కమిషనరేట్‌లో సైబర్‌ క్రైమ్‌లపై మీడియాకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ కవితతో కలిసి ఏవీ రంగనాథ్‌ పలుసూచనలు సలహాలను అందించారు.చాలామంది అత్యాశకు పోయి సైబర్‌ నేరస్థుల భారిన పడుతున్నారని జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. ముందు జాగ్రతత్తతోనే సైబర్‌ నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. బాగా చదువు కున్న వారు సైతం మోసపోవడం ఆందోళనకర మన్నారు. కోరియర్‌, ట్రేడింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌, బిట్‌కాయిన్‌ కొనుగోలు, కేవైసీ నింపాలని, గిఫ్ట్‌లు వచ్చాయని వాటిని తీసుకోవాలంటే పన్నులు చెల్లించాలంటూ సైబర్‌ నేరస్థులు అందినకాడికి దండుకుంటున్నారని తెలిపారు. నకిలీ వెబ్‌సైట్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ లాంటి మోసాలు సైతం పెరిగాయన్నారు. ఇలాంటి మోసాలు గుజరాత్‌, హరియాణ, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో జరుగుతున్నాయని వివరించారు. మోసపోయినట్టు గుర్తిస్తే (రెండు మూడు గంటల్లోనే) వెంటనే ‘1930’కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాల న్నారు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంతమంచిదని అభిప్రాయపడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు పం పించే లింక్‌లను క్లిక్‌లు చేయొద్దని, ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు, వాట్సాప్‌ చాటింగ్‌లు, వెబ్‌సైట్ల నుంచి డౌన్‌ లోడ్స్‌ చేయకపోవడమే మంచిదని చెప్పారు. వీడియోకాల్స్‌ లిఫ్ట్‌ చేయొద్దని కోరారు. సైబర్‌ ఫ్రాడ్స్‌ను అరికట్టేం దుకు దేశవ్యాప్తంగా అన్ని చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. ప్రచార మాధ్యమాలు, సోషల్‌ మీడియా, సినిమాలు, వాల్‌పోస్టర్లు, సైన్‌బోర్డ్స్‌ తది తర మార్గాల ద్వారా సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగహన కల్పిస్తామని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు చెందిన ఐటీ నిపుణులు, బ్యాంక్‌ అధికారులు, ఏజెన్సీల ద్వారా క్యాంపెయినింగ్‌ చేస్తామన్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిల్లో ప్రతి రోజూ వేలాది కోట్లను కొళ్లగొడుతున్నారు. షాపింగ్‌మాల్స్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌, ఫేస్‌బుక్‌ ఇతరాత్ర మార్గాల నుంచి డేటా సేకరిస్తున్న సైబర్‌ నేరస్థులు మాయమాటలతో బోల్తా కొట్టిస్తున్నారు. ఏసీపీలు శివమారూతీ, చాంద్‌ పాషా, సీఐలు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.