
మండల కేంద్రానికి చెందిన ఏదునూరి సిరి శ్రీనివాస్ కు ప్రతిష్టాత్మకమైన తెలంగాణ గ్రీన్ ఛాంపియన్ అవార్డు లభించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో పర్యావరణ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, రాష్ట్ర కాలుష్య నివారణ బోర్డు సభ్య కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధ చేతుల మీదుగా తెలంగాణ గ్రీన్ ఛాంపియన్ అవార్డు ను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చని పర్యావరణం కోసం, వ్యవసాయ సాగు లో క్రిమిసంహారక మందుల నివారణకు తాను చేసిన కృషికి గాను రాష్ట్ర ప్రభుత్వం తనను గ్రీన్ ఛాంపియన్ అవార్డు తో సత్కరించిందని తెలిపారు. ఈ అవార్డును స్వీకరించడం పట్ల నా భాద్యత మరింతగా పెరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల్లో సామాజిక స్పృహ పెంపొందించేందుకు అనేక సేవా కార్యక్రమాలు చేపడతానని చెప్పారు.