పచ్చదనం పరిశుభ్రత లో భాగంగా బుధవారం రోజు జడ్పీహెచ్ఎస్ గోపాల్పేట్ పాఠశాల విద్యార్థులు పచ్చదనం పరిశుభ్రత పై ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. పచ్చదనం వారోత్సవాల్లో భాగంగా నీటి నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు సిజిఆర్ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. విద్యార్థులు వనదేవతల వేషధారణ ధరించి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరవింద్, రాము, నరేష్, సతీష్, వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు.