
– లోపించిన పర్యవేక్షణ
– పెద్దగూడెంలో 50 చెట్ల కాలిపోయిన వైనం
నవతెలంగాణ – పెద్దవూర
రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు గత ప్రభుత్వం చుట్టిన హరితహారం పథకం అభాసుపాలవుతోంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. పచ్చదనం పెంపులో కీలకంగా మారాల్సిన అధికారుల పర్యవేక్షణ లోపంతోఉపాధి హామీపచ్చదనం పెంపులో కీలకంగా మారాల్సిన అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ కార్యక్రమం నిర్వీర్యమవుతోంది. నాటిన చెట్లు కొంత మంది రైతుల నిర్లక్ష్యం కారణంగా రోడ్ల వెంట ఉన్న పెద్ద చెట్లు, వృక్షాలు కాలి బూడిద అవుతున్నాయి. మండలంలోని పెద్దగూడెం గ్రామం లొ రహదారికిరువైపులా రూ. లక్షలు వెచ్చించి చెట్లును పెంచారు.కొంత మంది రైతులు నిప్పు పెట్టడంతో చెట్లు50 చెట్లకు పైగా కాలిపోయాయి. దీంతో రూ. లక్షల నిధులు వృథా అయ్యాయి.
లక్ష్యం నీరుగారుతోంది..?
సాగర్ నియోజకవర్గంలోని పోతునూరు,పులిచర్ల, చలకుర్తి,కుంకుడు చెట్టు తండా, కొత్తలూరు కు వెళ్లే రోడ్ల వెంట గ్రామాల్లోవందల సంఖ్యలో చెట్లు పెంచారు.సరైన ప్రణాళికలు లేకపోవడంతో రోడ్ల వెంట విద్యుత్తు తీగల కింద నాటారు. ఏపుగా పెరగగానే విద్యుత్తు సమస్య తలెత్తుతుందని కొమ్మలు, చెట్లను నరికివేస్తున్నారు. ఈదురుగాలులు, వర్షాలకు చెట్లు విరిగి విద్యుత్తు తీగలపై పడుతున్నాయని వాటిని నరికి వేస్తున్నారు.
ప్రత్యేకాధికారులు దృష్టిపెడితేనే: సర్పంచుల పదవీ కాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలన రావడంతో వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించి మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.