నవతెలంగాణ – బాన్సువాడ నసురుల్లాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాన్సువాడ మున్సిపాలిటీ కౌన్సిలర్ కాసుల రోహిత్ సూచించారు. సోమవారం బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు వార్డుల్లో ప్రజలకు చైతన్యపరిచారు. మున్సిపాలిటీకి సంబంధించిన ట్రాక్టర్ మీ ఇంటి ముందుకు వస్తుందని దాంట్లో వేస్ట్ చెత్తను వేయాలన్నారు. పిచ్చి కుక్కలను తరిమేందుకు కృషి చేస్తామన్నారు. కుక్కల సంతాన ఉత్పత్తి చెందకుండా ఆపరేషన్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు వాటిని సంరక్షించాలన్నారు. రోడ్లపై చెత్త చెత్త వెయ్యకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణాన్ని పరిశుభ్రత పట్టణంగా మార్చాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది స్వామి, నవనీత, నాయకులు అజీమ్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.