రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల కార్పొరేషన్ చైర్మైన్లను నియమించిన నేపథ్యంలో రాష్ట్ర మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ గా మెట్టు సాయి కుమార్ గురువారం హైదరాబాద్ లో ప్రమాణస్వీకారం చేసి,బాధ్యతలు చేపట్టారు.ఈ క్రమంలో భూపాలపల్లి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్ శుక్రవారం మర్యాదపూర్వకంగా సాయి కుమార్ ను కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సమ్మిరెడ్డి,రమేష్ రెడ్డి పాల్గొన్నారు.