గృహజ్యోతి పథకం పేద మధ్యతరగతులకు వరం

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ 
మండల కేంద్రంలో గృహ జ్యోతి పథకం కింద జీరో బిల్లులను లబ్ధిదారులకు అందజేస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దారిద్య్రరేఖకు దిగు వనున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు ‘గృహ జ్యోతి’ పథకం వరంలా మారనుంది. నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలలో ఈ పథకం కీలకమైనది. 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేసే ఈ పథకం అమలు కోసం సర్వత్రా ఎదురు చూస్తు న్నారు. కరెంటు లేకుంటే మనుగడే లేని రోజులివి. కానీ, బిల్లుల మోత అందరికీ భారమే. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యుత్‌ చార్జీల చెల్లింపు గుదిబండగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీగా ప్రకటించిన గృహజ్యోతి పథకం వారిలో ఆశలు రేకెత్తిస్తోంది.  కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున.200 యూనిట్ల లోపు ఉచిత కరెంటుతో ప్రతీ కుటుంబానికి వెయ్యి రూపాయల భారం తగ్గనుంది. విద్యుత్‌ చార్జీలను స్లాబుల వారీగా విధించడం జరుగుతోంది.100 యూనిట్ల లోపు వినియోగానికి యూనిట్‌కు రూ.3.40 పైసలు,100యూనిట్లు దాటితే యూనిట్‌కు రూ.4.80 పైసలు ఛార్జి చేస్తున్నారు. కస్టమర్‌, ఇతరత్రా ఛార్జీలు కలుపుకొని నెలకు రూ.1000 వరకు బిల్లు వస్తోంది. గృహజ్యోతి పథకం అమలులోకి వస్తే పేద కుటుంబాలకు ఈ మొత్తం మిగలనుంది ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మోహన్, మాణిక్ రెడ్డి,పండరి, బసవరాజ్ దేశాయ్, సంజీవ్, శ్రీనివాస్,  సబ్ ఇంజనీర్ సాయినాథ్, లైన్ ఇన్స్పెక్టర్ రామయ్య,సాయి రెడ్డి,కాంత రెడ్డి,రషీద్ ,లబ్ధిదారులు పాల్గొన్నారు.