ఇల్లు లేని ప్రతి ఒక్కరికి గృహ లక్ష్మి..

నవతెలంగాణ- చివ్వేంల: ఇల్లు లేని ప్రతి ఒక్కరు  గృహ లక్ష్మి తో ఇల్లు నిర్మించు కోవాలని బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం చివ్వెంల మండల కేంద్రంలో గృహలక్ష్మి లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలకు  శంకుస్థాపన చేసి మాట్లాడారు.. ముఖ్యమంత్రి కేసీఆర్  పేదలకు అందిస్తున్న వరం గృహలక్ష్మి పథకమని తెలిపారు.బీఆర్ఎస్‌ మాటల ప్రభుత్వం కాదని  చేతల ప్రభుత్వం అన్నారు.తెలంగాణలో ప్రజాసంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఇచ్చిన మాటను బీఆర్ఎస్‌ నిలబెట్టుకుందన్నారు. ప్రతి ఒక్కరు జగదీష్ రెడ్డి కి  అండగా నిలిసి మూడవసారి ఎమ్మెల్యే  గా గెలిపించాలని  కోరారు.ఈ కార్యక్రమం లో  మన్నా చర్చ్ పాస్టర్ సామ్యేల్, బి ఆర్ ఎస్ మండల నాయకులు ఎర్పుల నగేష్ జె జె ఆర్ యూత్ సభ్యులు తదితరులు  పాల్గొన్నారు..