అర్హులకు గృహజ్యోతి.!

Housing for the deserving!– అంతరాలంలో సవరణకు అవకాశం!
నవతెలంగాణ – మల్హర్ రావు
జీరో విద్యుత్తు బిల్లుల కోసం ఏడు నెలలుగా ఎదురుచూస్తున్న గృహజ్యోతి లబ్దిదారులకు ప్రభుత్వం తీపికబురు అందిం చింది. ఈ పథకంపై ప్రభుత్వం దృష్టిసారించడంతో చాలామందికి వచ్చే నెల నుంచి జీరో బిల్లులు రానున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆన్లైన్లో నమోదు కాని దరఖాస్తు లకు మోక్షం కలిగింది.
నమోదులో తప్పిదాలు..
ప్రజాపాలన కార్యక్రమంలో లబ్దిదారులు దరఖాస్తులను సరిగా పూరించలేదు. దీంతో అర్హులైన పలువురు పథకం ఫలాలు పొందలేకపోయారు. కొందరు ఆపరేటర్లు అంతర్జాలంలో సరిగా నమోదు చేయకపోవడం,మరికొందరు ప్రజాపాలన కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటున్న ప్రజలు అవాహన లేక ఆరు గ్యారంటీల్లో కొన్నింటిని నమోదు చేయలేదు. ఇలా నమోదు చేయని వారికి మొన్నటి వరకు నాట్ అప్లయ్ అనే సమాచారం వచ్చింది.దీంతో అర్హులు ఏడు నెలలుగా గృహజ్యోతి పథకానికి దూరంగా కావాల్సి వచ్చింది. ప్రభుత్వం మొన్నటి వరకు సవరణకు మాత్రమే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు నాట్ అప్లయ్ ని కూడా సవరించుకోవడానికి కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.నవీకరణ అయిన వారికి వచ్చే నెల నుంచి సున్నా బిల్లులు రానున్నాయి.
ఏజెడ్ఏ దరఖాస్తుకు ఇవి తప్పనిసరి..
మండలంలోని 15 గ్రామాల్లో గృహ విద్యుత్తు కనెక్షన్లు 5,571,వాణిజ్య 441,వ్యవసాయం 4320,ఇతరులు 241 ఉన్నాయి.రాయితీ పథకంలో పొలి వివరాలు నవీకరించుకోవారు.3,600, నెలకు ప్రభుత్వం చెల్లిస్తున్న రాయితీ రూ.1.789 కోట్లు.ప్రజాపాలన దరఖాస్తుల సవరణకు మండల పరిషత్ కార్యాలయంలో కేంద్రాన్నీ ఏర్పాటు చేశారు. గతేడాది దరఖాస్తుదారులు ఏ గ్రామ పరి ధిలో దరఖాస్తు చేశారో అక్కడికే పోవాల్సి ఉంటుంది. ఇది వరకు దరఖాస్తు చేసుకున్న ప్రజాపాలన పత్రం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్తు బిల్లులోని యూఎస్సీ నంబరును తీసుకెళ్లి అప్డేట్ చేయించుకోవాలి. అంతర్జాలంలో నమోదైన వారే పథకానికి అర్హులని అధికారులు స్పష్టం చేశారు.