
మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారులకు జీరో విద్యుత్ బిల్లును విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు కలిసి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో నాలుగో హామీ అయిన గృహజ్యోతి పథకంలో విద్యుత్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, నిరుపేదలకు అండగా ఉండాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గృహ జ్యోతి పథకంలో జీరో విద్యుత్ బిల్లులు వస్తున్నాయని ఇంటింటికీ తిరిగి జీరో బిల్లులపై వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎడి అశోక్, ఏఇ గోపి, లైన్మెన్, మాజీ సర్పంచ్ రాజేశ్వర్, మర్ల కిషన్, ఆరిఫ్, అలీమ్, జైల్ సింగ్, బేగరి రాజు, స్వామి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.