నవతెలంగాణ – జక్రాన్ పల్లి
గృహజ్యోతి పథకం నిరుపేదలకు లబ్ధి చేకూరుస్తుందని కేస్ పెళ్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రశాంత్ అన్నారు. జక్రాన్ పల్లి మండలం కేశ్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గృహ జ్యోతి లబ్దిదారులకు జీరో బిల్లులను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అమలు చేస్తుందన్నారు. ఈ పథకం వల్ల పేదలకు లబ్ది కలిగిందన్నారు ప్రజల తరపున వారు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామశాఖ అధ్యక్షులు ప్రశాంత్ మండల యువజన విభాగం ఉపాధ్యక్షులు మున్నూరు ప్రణయ్ మాజీ సర్పంచ్ సాయి కుమార్ సీనియర్ నాయకులు శ్రీధర్, గంగారెడ్డి, సాయన్న, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.