గృహలక్ష్మి ఆన్‌లైన్‌ డాటా ఎంట్రీ పరిశీలన డీఆర్డీఓ కృష్ణన్‌

నవతెలంగాణ-కొడంగల్‌
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గృహలక్ష్మి పథకం కింద గుర్తిం చిన లబ్దిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచే ప్రక్రియను వేగవంతం చేయాలని డీఆర్డీఓ కృష్ణన్‌ అన్నారు. కొడంగల్‌లోని ఎంపీడీవో కార్యాలయం లో గృహలక్ష్మి పథకం కింద గుర్తించిన లబ్దిదారుల వివరాలను ఆన్‌ లైన్‌లో పొందుపరుస్తున్న వివరాలను డీఆర్డీఓ కృష్ణన్‌ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గృహలక్ష్మీ పథకం కింద దరఖాస్తు చేసు కున్న దరఖాస్తుదారుల వివరాలను త్వరితగతిన ఆన్‌లైన్‌లో పొందుపరచా లని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పాండు, ఎంపీ ఓ శ్రీనివాస్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు