
– ఎం.పి.డి.ఒ శ్రీనివాస్
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న గృహ లక్ష్మి పధకానికి మండల వ్యాప్తంగా 5513 దరఖాస్తులు అందాయని ఎం.పి.డి.ఒ శ్రీనివాస్ తెలిపారు.
ఆయన శనివారం నవతెలంగాణ తో గృహలక్ష్మి దరఖాస్తులు పై తన కార్యాలయంలో మాట్లాడారు.అందిన ప్రతీ దరఖాస్తును క్షేత్రం స్థాయిలో ఆయా పంచాయితీ కార్యదర్శులు నమూనా ప్రకారం పరిశీలిస్తామని తెలిపారు.పధకం నిబంధనలు ప్రకారం దృవీకరణ పత్రాలు పారదర్శకంగా పరిశీలించి గౌరవ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కు అందజేస్తామని అన్నారు.
ఆయన తెలిపిన వివరాలు ప్రకారం పంచాయితీలు వారీగా దరఖాస్తుల వివరాలు..
పంచాయితీ దరఖాస్తులు
అశ్వారావుపేట 735
పేరాయిగూడెం 397
కోయ రంగాపురం 275
నారాయణపురం 267
ఊట్లపల్లి 263
ఆసుపాక 256
వినాయకపురం 246
కన్నాయిగూడెం 235
నందిపాడు 231
మల్లాయిగూడెం 225
గాండ్లగూడెం 217
కొత్త మామిళ్ళ వారి గూడెం 198
నారం వారి గూడెం 192
గుమ్మడవల్లి 170
అచ్యుతాపురం 166
దిబ్బ గూడెం 150
తిరుమలకుంట 134
అనంతారం 132
గుర్రాల చెరువు 128
వేదాంత పురం 120
కావడి గుండ్ల 118
బచ్చువారి గూడెం . 114
నారం వారి గూడెం కాలనీ 104
పాతరెడ్డి గూడెం 104
జమ్మి గూడెం 103
రామన్న గూడెం 66
27)మద్దికొండ 52
28)మద్దులమడ 43
29)పాత అల్లిగూడెం 42
30)కేశప్పగూడెం 30
ఈ దరఖాస్తు ల్లో అత్యధికంగా నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పంచాయితీలో 735,అత్యల్పంగా గిరిజన పంచాయితీ అయిన కేశప్పగూడెం లో 30 దరఖాస్తులు అందాయి.