– మంజూరు 22,150..దరఖాస్తులు 40వేలు
– భారీగా ఆశావహుల ప్రయత్నాలు
– స్వల్పంగా కేటాయింపులు
– ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల ప్రభుత్వ సాయం
– ఇంటింటా గృహలక్ష్మి సర్వే వేగవంతం
– యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు
ఎన్నికల ముందు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలకిëపై ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. తమకే రావాలని ఆరాటపడుతున్నారు. పోటీపడి మరి దరఖాస్తులు చేసుకున్నారు. మండల కార్యాలయాలు, జిల్లా కలెక్టరరేట్‌లో క్యూ కట్టి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. పేదలే కాదు.. ఆర్థికంగా ఉన్న వారూ సైతం దరఖాస్తులు పెట్టుకున్నారు. వీరిలో ఎంపీటీసీలు, సర్పంచులూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రకారం జిల్లాలో 39,702 దరఖాస్తులు గుడువులోగా వస్తే.. అనంతరం పంచాయతీ కార్యదర్శులు, జిల్లా స్థాయి అధికారులకు ఇచ్చిన దరఖాస్తులు అదనమే. ఈ ప్రచారం ప్రకారం సుమారు 40వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. కానీ ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన ఇండ్లు మాత్రం 22,150 మాత్రమే. మంజూరు స్వల్పమైతే దరఖాస్తులు డబుల్ వచ్చాయి. వీరిలో గృహ’లకిë’ ఎవరిని వరిస్తుందో.
సొంత జాగ ఉన్న పేదలు పక్కా ఇండ్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ‘గృహలక్ష్మి’ ఎవరిని వరిస్తుందోనని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో రూ.3లక్షల ఆర్థిక సాయం అందిస్తుండడంతో ఇండ్లులేని పేదలు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నెల 10 వరకే తొలివిడత లబ్దిదారుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించగా జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 39,702 దరఖాస్తులు వచ్చాయి. వీటితోపాటూ పంచాయతీ కార్యదర్శులు, జిల్లా కలెక్టరేట్‌లో వచ్చిన దరఖాస్తులు కలుపుకుని 40వేలకు పైగా పేదలు గృహలక్ష్మి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కానీ జిల్లాకు ప్రభుత్వం 22,150 ఇండ్లను మాత్రమే కేటాయించింది.
జిల్లాకు 22,150 ఇండ్ల కేటాయింపు
గహలక్ష్మి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో భాగంగా జిల్లాలోని 8 నియోజకవర్గాలకు మొత్తంగా 22,150 ఇండ్లను కేటాయించింది. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి 3000, చేవెళ్ల నియోజకవర్గానికి 2500, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి 3000, రాజేంద్రనగర్ నియోజకవర్గానికి 3000, మహేశ్వరం నియోజకవర్గానికి 3000, కల్వకుర్తి నియోజకవర్గానికి 1650, షాద్‌నగర్ నియోజకవర్గానికి 3000, ఎల్బీనగర్ నియోజకవర్గానికి 3000 చొప్పున గృహలక్ష్మి ఇండ్లను కేటాయించింది.
మార్గదర్శకాలివే..
గహలక్ష్మి పథకం అమలుపై ప్రభుత్వం నిర్ధిష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆహార భద్రత కార్డుతో పాటు సొంత జాగ ఉండి ఇల్లులేని పేదలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. డబుల్ బెడ్ రూం ఇండ్లు మాత్రమే నిర్మించుకోవాలని సూచించింది. ఇంటి నిర్మాణానికి పూర్తి సబ్సిడీతో రూ.3లక్షలను విడతల వారీగా లబ్ధిదారులకు అందించనుంది. గ్రామ కంఠ, మున్సిపాలిటీ పరిధిలో సొంతంగా ఇంటి జాగ కలిగి ఉండాలి. ఆ స్థలం సదరు లబ్ధిదారుడిదేనని నిరూపించే ఆనవాళ్లు ఉండాలి. డాక్యుమెంట్, ఇంటి నంబర్, విద్యుత్తు బిల్లు, పన్ను చెల్లింపు రసీదులు ఉండాలి. ఓటరు కార్డు, ఆధార్‌కార్డు, ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తుదారు స్థానికురాలై ఉండాలి. మహిళ పేరునే ఇంటిని మంజూరు చేస్తారు. దరఖాస్తుదారు ఆర్‌సీసీ భవనం కలిగి ఉండరాదు. జీవో నంబర్ 58, 59 కింద లబ్దిపొంది ఉండకూడదు.
సర్వే షురూ చేసిన అధికారులు
జిల్లా వ్యాప్తంగా గృహలక్ష్మి పథకానికి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో అధికారులు ఇంటింటి సర్వేను ప్రారంభించారు. ఈ నెల 20వరకు అధికారులు దరఖాస్తుదారుల ఇంటింటి సర్వే చేసి వారి దరఖాస్తులు సక్రమమేనా అని తేల్చే పనిలో పడ్డారు. దరఖాస్తుదారులకు ఆహారభద్రత కార్డు ఉండి గతంలో ఇందిరమ్మ ఇళ్లు గానీ, డబుల్ బెడ్ రూం ఇళ్లుగానీ మంజూరు అయ్యిందా లేక సొంతిళ్లు ఉందా.. లేదా అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. సొంత జాగ ఉండి ఇళ్లు లేని వారికి మాత్రమే లబ్దిదారులుగా గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ క్రమంలో అధికారులు సర్వే చేస్తున్నారు. ఇప్పటికే ఇంటింటి సర్వే పూర్తి చేసి సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
దండిగా దరఖాస్తులు..
జిల్లా వ్యాప్తంగా గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు దండిగా వచ్చి పడ్డాయి. ఆగస్టు 10, 11, 12వ తేదీ వరకు మండల కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించారు. ప్రజలు తహసీల్దార్, కలెక్టరేట్, మునిసిపాలిటీ కార్యాలయాలకు పోటెత్తారు. జిల్లా వ్యాప్తంగా 40వేలకు పైగా పేదలు గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 8982, చేవెళ్ల నియోజకవర్గంలో 5366, మహేశ్వరం నియోజకవర్గంలో 5472, రాజేంద్రనగర్ నియోజకర్గంలో 2342, కల్వకుర్తి నియోజకవర్గంలో 6865 దరఖాస్తులు వచ్చాయి. ఇవే కాకుండా జిల్లా స్థాయిలో అధికారులకు, కార్యదర్శులకు మరో వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. మొత్తంగా 40వేలకు పైగానే వచ్చాయి.
పూరిగుడిసెలోనే మగ్గుతున్నాం
లక్షలు పెట్టి ఇళ్లును కట్టుకునే స్తోమత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఇల్లు రాలేదు. ఈ ప్రభుత్వం డబుల్ ఇడ్రూం ఇల్లు ఇస్తానంటే మళ్లీ దరఖాస్తు చేసుకున్న.. ఇదీ రాలేదు. గుడిసెలో ఉన్నోళ్లకు గృహలకిë ఇల్లు ఇస్తామంటుంది. నాది పూరి గుడిసెనే. ఆడ బిడ్డను పెట్టుకుని పూరిగుడిసెలోనే ఉంటున్నా. దయ చేసి గృహలకిë ఇల్లు ఇస్తే సొంతిళ్లు కట్టుకుంటా.
పంది యాదయ్య, కాగజ్‌ఘట్ ప్రతి ఒక్కరికీ ఇవ్వాల్సిందే
గృహలకిë కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేయాలి. కుటుంబం ప్రామాణికంగా భర్త పేరుతో ఇంటి స్థలం ఉన్నా, వారి భార్య, తల్లిపేరుతో దరఖాస్తు చేసుకున్నా పరిగణలోకి తీసుకోవాలి. రాజకీయాలకు అవకాశం ఇవ్వొద్దు. పారదర్శకత పాటించాలి. ఎన్నికల స్టంట్‌గా మారకూడదు. జిల్లాలో ఇప్పటికే పేదలు సొంత ఇండ్లు లేక ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్నారు. తమకు ఇండ్లు వస్తాయని ఆశ పడుతున్నారు.
కె.జగన్, వ్యకాస జిల్లా కార్యదర్శి