
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గృహ లక్ష్మీ” పథకంలో భాగంగా ఇండ్ల నిర్మాణం కోసం అర్హులైన వారు ఈ నెల 14 వ తేది వరకు దరఖాస్తులు చేసుకోవాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.గురువారం 10వ తేది నాటికే దరఖాస్తులకు గడువు ముగిసిందని, అయినా ఈ పథకం నిరుపేదలందరికి వర్తింప చేయాలనే ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు.కావున ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోలేనివారు బోధన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆగస్టు 14వ తేది వరకు దరఖాస్తులు సమర్పించాలని ఆయన ప్రకటనలో తెలిపారు.