
ప్రభుత్వం అమలు చేయనున్న గృహ లక్ష్మీ భరోసా పథకం ను పారదర్శకంగా అర్హులైన వారికి అందేలా చూడటమే లక్ష్యమని ఎంపిడిఓ గొట్టిపర్తి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఎంపిడిఓ ఆదేశానుసారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలో గృహ లక్ష్మీ దరఖాస్తులను నేరుగా దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్ళి పరిశీలించారు. ఈఓ గజవల్లి హరికృష్ణ ఆద్వర్యంలో పంచాయతీ సిబ్బంది బృందం వార్డుల వారీగా సిబ్బంది దరఖాస్తు దారుల స్థితి గతులు, వారి యొక్క ఆర్ధిక పరిస్థితులను నమోదు చేసుకుంటున్నట్లు ఎంపిడిఓ తెలిపారు.మండలంలోని 30 పంచాయతీలలో సుమారు 5700 దరఖాస్తులు గృహ లక్ష్మీ పథకానికి వచ్చాయని పేర్కొన్నారు.అత్యదికంగా అశ్వారావుపేట పంచాయతీలో 750 వరకు రాగా పేరాయిగూడెం లో 400 లు వరకు దరఖాస్తులు అందినట్లు వివరించారు.అనుకున్న సమయానికి దరఖాస్తులు పరిశీలించి లబ్దిదారుల జాబితా సిద్ధం చేయనున్నట్లు స్పష్టం చేశారు.ధరఖాస్తులు పరిశీలనలో పంచాయతీ సిబ్బంది ఉన్నారు.