– ఒక రకం వంగడం బదులు మరొక వంగడం అప్పగింత
– గ్రోమోర్ ఆఫీసు ఎదుట రైతుల ఆందోళన
– వ్యవసాయ అధికారిని రప్పించిన రైతులు
నవతెలంగాణ – కోటగిరి
కోటగిరి మండల కేంద్రంలోని గ్రోమోర్ ఆఫీస్ ఎదుట శుక్రవారం రైతులు ఆందోళన నిర్వహించారు. గంగా కావేరి సంబంధించిన వరి వంగడానికి బదులు ఆర్కే సోనారకం వరి విత్తనాలను ఇవ్వటముతో ఇప్పటివరకు పొలం పాలు పోసుకోకపోవడంతో ఆత్మహత్య నాకు దిక్కని రైతు తోటి రైతుల దగ్గర బాధను వ్యక్తం చేయడంతో గ్రోమోర్ ఆఫీసు ఎదుట రైతులు ఆందోళన చేశారు రైతు 15 రోజుల క్రితం పంట పాలు పోసుకోవడం లేదని ఫిర్యాదు చేసినప్పటికీ, నిర్లక్ష్య సమాధానం ఇవ్వటం జరిగిందని, కౌలుకు చేసిన పొలం ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. పోతంగల్ మండలంలోని దోమలేడ్గి గ్రామానికి చెందిన రైతు తుకారాం గౌడ్ ఇదే విషయాన్ని గ్రోమోర్ సభ్యులకు తెలిపినప్పటికీ సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు, రైతుల పరిస్థితిని ఆసరాగా తీసుకొని త్వరిత కాలంలో పంటకు వచ్చే సన్న రకం బదులు లేటుగా వచ్చే వరి వంగడాలను వాళ్లకి తెలుపకుండా ఇవ్వడం జరిగింది, గాండ్ల గంగారం రైతు పరిస్థితి విషాదకరంగా మారింది, పొలంలోకి నీరు లభించడం దుర్లభంగా మారింది, ప్రాముఖ్యత ఉన్న కంపెనీ గ్రోమోరని వెళితే మాకు తెలియకుండా, మేము అడిగింది ఇవ్వకుండా వేరే రకం వంగడం ఇచ్చి నట్టేట ముంచారని నాకు చావే శరణ్యమని పేర్కొన్నారు, ఈ విషయంపై రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్ చేశారు, సిబ్బంది దాటవేసే ధోరణి, రైతుల పట్ల చిన్నచూపు స్పష్టంగా కనబడింది, రైతులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం పట్ల ఏవో శ్రీనివాసరావు గ్రోమోర్ కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు , వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పొలాలు పరిశీలించడం లేదని , పొలాలు పరిశీలిస్తే ఏ రకమైన సమస్యలు రావనీ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు, ఆయా విత్తన షాపుల్లో వరి వంగడాలను పరిశీలించి రైతులకు అవగాహన కలిగిస్తే ఇటువంటి నష్టం రాదని రైతులు పేర్కొన్నారు గాండ్ల గంగారం వరి విత్తనాలు కొన్నటువంటి రసీదును ఏవో శ్రీనివాసరావుకి చూపించారు, మేము అడిగింది ఒకటి వాళ్ళు ఇచ్చింది మరొకటి ఈ విధంగా ఎంతమందిని మోసం చేశారని రైతులందరూ ఏవొ శ్రీనివాసరావు ను నిలదీశారు , ఏవో శ్రీనివాసరావు దాటవేసే ధోరణిలో మాట్లాడటం రైతులలో ఆందోళన కలిగించింది, గ్రోమోర్ సంస్థకి సమర్థించే విధానములో ఏవో మాట్లాడడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు , ఈ రకం విత్తనాలను ఎంతమందికి ఇచ్చారని వెంటనే సమాచార ఇవ్వాలని లేనియెడల చర్య తీసుకుంటామని పేర్కొన్నారు, ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేయడంతో ఈనెల 18వ తారీఖున, గ్రోమోర్ సమస్త ప్రతినిధులు, ఆర్కే సోనా కంపెనీ ప్రతినిధులు వస్తున్నారని, ఏవో తెలపడంతో రైతులు శాంతించారు, అనంతరం రైతు వేదికలు ఏవో శ్రీనివాసరావుకి రైతులు గ్రోమోర్ ద్వారా వరి వంగడాలను కొన్న రసీదులను అందజేశారు.