గ్రూమ్‌ ఇండియా కొత్త సిఇఒగా సంజరు ఎనిశెట్టి

హైదరాబాద్‌: నేచురల్‌ సలోన్‌గా గుర్తింపు పొందిన గ్రూమ్‌ ఇండియా సలోన్‌ అండ్‌ స్పా, తమ కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సిఇఒగా సంజరు ఎనిశెట్టిని నియమించుకున్నట్లు వెల్లడించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చిందని ఆ సంస్థ పేర్కొంది. పెట్టుబడులు, స్టార్టప్‌ రంగంలో ఎనిశెట్టికి 18 సంవత్సరాలకు పైగా విస్తృతమైన పరిజ్ఞానం, అనుభవం ఉందని నేచురల్స్‌ సెలూన్స్‌ సహ వ్యవస్థాపకుడు, సిఎండి సి కె కుమారవేల్‌ పేర్కొన్నారు. ఎనిశెట్టి నాయకత్వంలో వృద్ధి, ఆవిష్కరణ, విజయాల కొత్త అధ్యాయం కోసం తాను ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు.