ప్రశాంత వాతావరణంలో గ్రూప్-1 పరీక్ష..

– అన్ని కేంద్రాల్లో పటిష్ఠ భద్రత..
– 7734 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు..
– జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష  ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. ఆదివారం గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షా నిర్వహణ నేపథ్యంలో స్థానిక  ప్రతిభా జూనియర్ కళాశాల, శ్రీనిధి జూనియర్ కళాశాలను సందర్శించారు.  కేంద్రాల్లో బయో మెట్రిక్ , అభ్యర్థుల హాజరు శాతం అలాగే పరీక్షల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా నేపథ్యంలో  సూర్యాపేట పట్టణంలో 32 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే పరీక్షా కేంద్రాల్లో ఎక్కడ కూడా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టామని అన్నారు. జిల్లాలో 9725 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా పరీక్షలకు 7734 మంది హాజరు కాగా 1991 మంది గైరాజరు ఐ నారని అలాగే 79.53 శాతం  హాజరు శాతం నమోదు అయినట్లు తెలిపారు. అందులకు (scrabe) ప్రత్యేక గదులు అలాగే వికలాంగులకు కింద ఫ్లోర్ లలో సదుపాయం కల్పించడం జరిగిందని తెలిపారు.
సూర్యాపేట నందు పరీక్షల నేపథ్యంలో ఉదయం సమయంలో సూర్యాపేట పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి అలాగే తిరుమలగిరి నుండి ఆర్.టి. సి. బస్సు ల సదుపాయం కల్పించామని , అదేవిదంగా ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడెం అలాగే జనగాం నుండి కూడా సూర్యాపేటకు అభ్యర్థులు చేరుకునేలా బస్సు సౌకర్యం కల్పించామని ఈ సందర్బంగా తెలిపారు.అంతకు ముందు కలెక్టరేట్ లో స్టాంగ్ రూమ్ నుండి రూట్ల వారీగా  ప్రశ్నపాత్రల పంపిణీ  ప్రక్రియను అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక, ఏ.ఎస్పీ నాగేశ్వర రావుతో కలసి పరిశీలించారు.
పరీక్షా కేంద్రాల పరిశీలన.
 గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష  నిర్వహణ నేపథ్యంలో  స్థానిక ఏ.వి.ఎం ఉన్నత పాఠశాల, సిద్ధార్థ హైస్కూల్ అలాగే స్పందన డిగ్రీ అండ్ పి.జి కళాశాలను సందర్శించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సూర్యాపేట నందు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినామని అన్నారు. కేంద్రాల్లో బయో మెట్రిక్, హాజరు శాతం, గైరుహజరు వివరాలు అలాగే మెడికల్ స్టాల్స్ ను, అభ్యర్థుల పరీక్షా నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సి.ఈ. ఓ శిరీష, జిల్లా అధికారులు, సెక్టార్ అధికారులు, చీఫ్ సూపర్డెంట్లు , అబ్జర్వర్లు ,  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ బి.ఎస్. లత, డిప్యూటీ సి.ఈ. ఓ శిరీష, రీజినల్ కో ఆర్డినేటర్ డా. వి. వెంకటేశులు, జిల్లా అధికారులు, సెక్టార్ అధికారులు, చీఫ్ సూపర్డెంట్లు , అబ్జర్వర్లు , పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.