– రాణి రుద్రమ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2 వాయిదా వేయాలని నిర్ణయం తీసుకోవడం నిరుద్యోగుల విజయం అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త తేదీల ప్రకటనతో పాటు పోస్టుల పెంపుపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్‌క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. యువతకు ఉపాధి కల్పించే యువ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ల లీకేజీకి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని సూచించారు.