
నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా యూనివర్సిటీ లోని సెంట్రల్ లైబ్రరీ ముందు రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సంధర్బంగా ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ యూనివర్సిటీ అద్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ఐదేళ్ల నుంచి జాబ్ క్యాలెండర్ లేక అనేక మంది నిరుద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి తరుణంలో నేడు గ్రూప్స్ కు సంబంధించిన వరుస పరీక్షల వల్ల కనీసం ఒక్క పరీక్ష నుంచి ఇంకో పరీక్షకు సమయం కూడా లేకుండా పరీక్షలు ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడి కి గురవుతున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాట్లు తెలిపారు. గ్రూప్ 2 పరీక్ష సిలబస్ ప్రిపరేషన్ వ్యవధి తక్కువ ఉండడంతో గ్రూప్ 2 అభ్యర్థులు టీఎస్పీఎస్సీ బోర్డు ముందు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడుతుంటే పోలీసులు అత్యుత్సాహం చూపించి గ్రూప్2 అభ్యర్థుల పైన లాఠీచార్జ్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కొట్లాడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు, కల్వకుంట్ల వంశానికే లభించుతున్నాయని, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కమిటీ విచారం వ్యక్తం చేశారు. తక్షణమే గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని లేకుంటే టిఎస్పిఎస్సి బోర్డును ముట్టడికి అన్ని యూనివర్సిటీలో ఉన్న గ్రూప్ 2 అభ్యర్థులు, విద్యార్థులు ఏకనకి పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈక నైనా పరీక్షల సమయలను మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ ఉపాధ్యక్షులు వెంకటేష్ ,సహాయ కార్యదర్శి సాయి ప్రసాద్ , యూనివర్సిటీ నాయకులు సిరాజ్ , అనిల్ ,రమణ తోపాటు తదితరులు పాల్గొన్నారు.