నవతెలంగాణ – రామారెడ్డి
కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాటలో చెప్పాలంటే స్వేచ్ఛ ఎక్కువ, అలాంటి పార్టీలో కాంగ్రెస్ గ్రూప్ తగాదాలు భగ్గుమంటున్నాయి. జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి సంబంధించిన సోషల్ మీడియా బ్యానర్ ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు కల్వకుంట్ల మదన్మోహన్ రావు ఫోటో లేదని, సీడీసీ చైర్మన్ ఇర్షాద్ , మదన్మోహన్ కు సంబంధించిన ఫోటో లేకుండా బ్యానర్ కడితే చింపేస్తామని, మొదటిసారి, చివరిసారి చెప్పడం అని మెసేజ్ పంపడంతో, నా రెడ్డి మోహన్ రెడ్డి జోకుడుగాళ్ళకు పదవులు వస్తాయని మెసేజ్ పెట్టారని, 2018లో జోకు తేనే జెడ్పిటిసి టికెట్ టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వస్తే ఇచ్చారు అని ఇర్షద్ మెసేజ్ పెట్టారు. దీనితో కాంగ్రెస్లో ముసలం ముసురుకోని, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గీ రెడ్డి మహేందర్ రెడ్డి స్పందిస్తూ ఇప్పుడు ఇచ్చిన పోస్టులను పునరాలోచించాలని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు దక్కాలని, ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం కొట్లాడండి. దృష్టి అభివృద్ధిపై పెట్టండి అని, ప్రతిపక్షాలు ప్రశ్నించే ప్రశ్నలకు జవాబులు పెట్టండి, కానీ ఫోటోలు పెట్టకుండా పోస్టల్ చింపండి అనేది జోకుడే అని ఘాటుగా విమర్శించారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన కార్యకర్తలు నాయకుల గ్రూపు తగాదాల వల్ల తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు వస్తే ఒక నాయకుని దగ్గరికి వెళ్తే, మరో నాయకునికి కోపం వస్తుంది, ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా నాయకులు చొరవ తీసుకోవాలి. కార్యకర్తలకు భరోసా కల్పించి పార్టీని కాపాడుకునేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు.