– ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ-పోచంపల్లి
కాంగ్రెస్ లో చేరికల జోరు ఊపందుకుంది అధికార పార్టీ వీధి కాంగ్రెస్ పార్టీ లో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని అధికార పార్టీ మీద అసంతప్తితో కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై కారును వదిలి హస్తం గూటికి చేరుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.శనివారం మండలంలోని ఆయా గ్రామాల నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బిఆర్‌ఎస్ ను నమ్మే పరిస్థితులు లేరని వారంతా మార్పు కోరుకుంటున్నారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం, బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీలో చేరిన వారిలో గోదాసు బాల్ రాజ్, గొదాసు లక్ష్మణ్, సందీప్, బాలకష్ణ, భాస్కర్, సుధాకర్,శ్రీశైలం, వెంకటేష్ లతో పాటు సుమారు 60మంది పార్టిలో చేరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాక మల్లేశం సామ మధుసూదన్ రెడ్డి సింగల్ విండో డైరెక్టర్ సామ మోహన్ రెడ్డి తడాకా వెంకటేశం భారత లవ కుమార్ జగన్ రెడ్డి రాఘవరెడ్డి బండారు ప్రకాష్ రెడ్డి గునిగంటి రమేష్ వెంకటేశం కుమార్ కౌన్సిలర్లు మోతె రజిత రాజు బోగా భానుమతి విష్ణు ఆయా గ్రామ సర్పంచులు ఉపసర్పంచ్లు వార్డు సభ్యులు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.