నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీ కౌన్సిల్లో కాంగ్రెస్ కు మద్దతు పెరుకుతుంది. ఇటీవల బి.ఆర్.ఎస్ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య ను సొంత పార్టీతో పాటు కాంగ్రెస్, బిజెపి లోని 31 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టడంతో వారు దిగిపోయారు. నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి జిల్లా కలెక్టర్ సమయము తేదీని ప్రకటించలేదు. తిరిగి బీఆర్ఎస్ ఆస్థానానికి కైవసం చేసుకోవాలని చూస్తుంది. కాంగ్రెస్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవడం కోసం పలు ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు పోతున్నారు. చైర్మన్ ,వైస్ చైర్మన్ ను దింపే ముందు ఎలాగైతే క్యాంపులు ఏర్పాటు చేశారు. తిరిగి ఎన్నుకోడానికి కూడా క్యాంపులు ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్కు 11, మంది బిజెపికి ఏడుగురు బిఆర్ఎస్ కు 17 మంది ఉన్నారు. మంగళవారం రోజు బి ఆర్ ఎస్ కు చెందిన జిట్ట వేణు తిరిగి కాంగ్రెస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ 12 కాగా బిఆర్ఎస్ 16 మంది కౌన్సిలర్లు అయ్యారు. బిఆర్ఎస్ లో ఒకరిపై ఒకరు నమ్మకం లేకుండా పోయింది. నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరడానికి లోపాయకారికంగా మంతనాలు జరిగినట్లు తెలిసింది. చైర్మన్ వైస్ చైర్మన్ సీట్ కోసం బిఆర్ఎస్ లో రెండు గ్రూపులుగా విడిపోయినట్లు సమాచారం. కోఆప్షన్ కింద ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన ఓటు ను ఎన్రోల్మెంట్ చేసుకుంటే తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.
బీ ఆర్ ఎస్ కైవసం: భువనగిరి మున్సిపాలిటీ స్థానాన్ని తిరిగి బీఆర్ఎస్ చేర్చుకుంటుందని ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి తెలిపారు. మా పార్టీ కి సంపూర్ణ మద్దతు ఉందని వారి పేర్కొన్నారు. ఇతర పార్టీ కౌన్సిలర్లు తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్రలోభ పెట్టడానికి చూస్తుందని ఆరోపించారు.