పెరట్లో కూరగాయల సాగు, సేంద్రియ ఎరువులతో ఆరోగ్యం..

నవతెలంగాణ- రెంజల్

తమ ఇంటి ముందు పెరట్లో కూరగాయలను సాగు చేస్తూ తమ కుటుంబాలను కాపాడుకుంటున్నామని, రెంజల్ మండలం నీలా క్యాంపుకు చెందిన ఎమ్మెల్ రాజు పేర్కొన్నారు. ప్రతి శనివారం సాటాపూర్ సంతలో కూరగాయలు కొనడానికి విపరీతమైన డబ్బులు ఖర్చు అవుతుండడంతో, తమ ఇంటి పెరట్లో అన్ని రకాల కూరగాయలను సాగు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం శనివారం బజారుకు వెళ్లి కూరగాయలు తీసుకోవాల్సిన అవసరం లేకుండానే తమ పెరట్లో సేంద్రియ ఎరువులతో తయారు చేసుకున్న కూరగాయలను మాత్రమే వాడుకుంటున్నామని ఆయన అన్నారు. కూరగాయలతో పాటు పూల మొక్కలను కూడా సాగు చేస్తున్నట్లు ఆయన అన్నారు. రసాయనకేరులకు బదులుగా సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు ఆరోగ్యానికి మంచిదని ఆయన తెలిపారు.