ముంబయి : ఎఫ్ఎంసీజీ కంపెనీ సర్వేశ్వర్ ఫుడ్స్ లిమిటెడ్ 2024- 25 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 59.24 శాతం వృద్థితో రూ.137.79 కోట్ల నికర అమ్మకాలు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.86.53 కోట్ల విక్రయాలు నమోదు చేసింది. ఇదే సమ యంలో రూ.1.84 కోట్లుగా ఉన్న లాభాలు.. గడిచిన త్రైమాసికంలో 30.9 శాతం పెరిగి రూ.2.41 కోట్లకు పెరిగాయి. ఏప్రిల్- సెప్టెంబర్ ప్రథమా ర్థంలో 28.37 శాతం వృద్థితో రూ.504.36 కోట్ల రెవెన్యూ ప్రకటించింది.