సెప్టెంబర్‌లో రూ.1.73 లక్షల కోట్ల జిఎస్‌టి వసూళ్లు

GST collection of Rs.1.73 lakh crore in Septemberన్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌లో రూ.1.73 లక్షల కోట్ల జిఎస్‌టి వసూళ్లు అయ్యిందని మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడాది ఇదే నెల వసూళ్లతో పోల్చితే 6.5 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. 2024లో ఇప్పటి వరకు జిఎస్‌టి వసూళ్లు 10.1 శాతం పెరిగి రూ.9.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో రూ.8.29 లక్షల కోట్ల వసూళ్లు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం జిఎస్‌టి వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.