– ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి
నవతెలంగాణ – నెల్లికుదురు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్స్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి అన్నారు. మండలంలోని ఆలేరు స్టేజి వద్ద డిసెంబర్ 7న జరుగే ఆటోల బంద్ పోస్టర్లు విడుదల చేసే కార్యక్రమాన్ని సోమవారం నినిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్ ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోతూ ఫైనాన్స్ కట్టలేక దివాలా తీసిన ఆటో డ్రైవర్స్ కు రూ.12000 సహాయం చేస్తానన్న హామీ అమలు చేయాలని అన్నారు. మోటార్ వాహన కార్మికులకు సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి వారిని ఆదుకోవాలని కోరారు .రాష్ట్రంలో ప్రభుత్వ ఖాళీలను భర్తీ చదువుకున్న నిరుద్యోగ యువకులు బ్రతుకుతెరువు కోసం ఆటో డ్రైవర్లుగా మారి కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపాడు. వీరిలో అత్యధిక మంది దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాల పేద లే నని వారిని ఆదుకోకపోతే ఆత్మహత్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో ఆటో కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారికి ఇండ్ల మంజూరు చేయాలని డిమాండ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఓవి చట్ట సవరణ మోటార్ రంగానికి గొడ్డలి పెట్టలా మారిందని దానిని పూర్తిగా ఉపసవలించుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అనేక ఆటో సంఘాలు జేఏసీగా ఏర్పడి డిసెంబర్ 7 తారీఖున గడప తలపెట్టిన ఆటోల బంద్ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు సట్ల నరేష్ నాయకులు కోరి శ్రీనివాస్ ముత్తయ్య అమీర్ జలంధర్ సాయిలు వెంకన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు.