అబద్ధపు హామీలను గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి

– కృపాకర్ రావు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిందని వాటిని వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు కృపాకర్ రావు అన్నారు. గురువారం మండలంలోని పసర గ్రామంలో పి ఎస్ ఆర్ గార్డెన్ లో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు మద్దినేని తేజ రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులు గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు కృష్ణాకర్ రావు,మండల ఇంచార్జీ శ్రీలమంతుల రవీంద్ర చారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తేజ రాజు ,కృష్ణాకర్ రావు. మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక హామీలు 6 గ్యారెంటీలు 66 అబద్ధాలు చేసి అటువంటి హామీలు ప్రభుత్వం లోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేయకుండా దాటవేసే దోరణి లోఉన్నందున,ప్రజలకిచ్చిన హామీల అమలు కై భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలని ఇచ్చిన 6 గ్యారెంటీలు అనేక హామీల అమలు అయ్యేదాకా ఉద్యమాలు చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ధీటుగా ఎన్నికల్లో పోటీ చేసి బి.జే.పి అభ్యర్థులను గెలిపించుకొనేందుకు బూత్ స్థాయి లో కార్యకర్తలు పార్టీ బలోపేతం దిశ గా పనిచేయాలని అన్నారు మండల సమావేశం లో అనేక రాజకీయ తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించి డిమాండ్ చేయనైనది బేషరతుగా రైతులకు రుణమాఫీ ఏక కాలంలో 2లక్షల రూపాయలు వెంటనే రుణమాఫీ చేయాలి.ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. ప్రతి నిరుద్యోగికి 4000 చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వాలి పట్టాదారు పాసుబుక్ ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా క్రింద ఎకరానికి 15 వేలు వెంటనే రైతుల ఖాతాలో వేయాలి. ధరణి పోర్టల్ ప్రక్షాళన చేయాలి ,గత వర్షాకాలంలో పంట పొలాలు మరియు ఇండ్లు కొట్టుకుపోయిన ఇండ్లు వారికి పంట రుణ సహాయం మరియు వారికి ఇంటికొక ఇల్లు ఇవ్వాలని లక్నవరం చెరువు ప్రధాన కాలువ లైన్లు వెంటనే చేపట్టాలి కర్లపల్లి గుండ్ల వాగు ప్రధాన కాలువ లైన్లను లైన్లు చేయాలి 9 లక్నవరం రాంపూర్ కు వచ్చే తాళ్ల వరకు వచ్చే కాలువ బ్రిడ్జి కిందివైపులా కరకట్ట నిర్మించాలి గత ఏడాది అదే కాలువ నుండి నీళ్లు ప్రధానంగా రావడంతో పస్రా గ్రామంలో ఉన్నటువంటి ఇండ్లు గొర్లు మేకలు పంట పొలాలు కొట్టుకుపోవడం జరిగింది మహిళలకు ప్రతి మహిళకు 2500 ప్రతి నెలకు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు ఏది చేయలేదు అదే విధంగా వితంతువులకు 4000 పెన్షన్ వికలాంగులకు 6000 పెన్షన్ ఏమైంది అని , విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే ఇవ్వాలి. ప్రతి పేదవాడికి ఇండ్ల స్థలం ఇల్లు కట్టిస్తామని చెప్పినా ప్రభుత్వం ఏమి చేయలేదు ఈ డిమాండ్లన్నీ వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ గోవిందరావుపేట్ మండల పార్టీ డిమాండ్ చేయనైనది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యురాలు సిహెచ్ స్వప్న జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు రమాదేవి జిల్లా గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు రాజన్న నాయక్ కె ధర్మారావు శ్రీనివాస్ బి చంద్రమౌళి కే సదానందం బి సమ్మయ్య ఎం రంగారెడ్డి జి .రాజు బూత్ అధ్యక్షులు జి .రాజు కే. బాబురావు ఏం. సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.