నవతెలంగాణ- వైరాటౌన్: ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి, మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీకి తన శరీరాన్ని దానం చేశారు. శనివారం తన పెద్ద కుమారుడు జి.వి.రామన్ పుట్టినరోజు సంధర్భంగా గుడిమెట్ల రజిత మరణాంతరం తన మొత్తం శరీరాన్ని మమత మెడికల్ కళాశాలకు దానం చేస్తూ అగ్రిమెంట్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గుడిమెట్ల రజిత మాట్లాడుతూ బ్రతికి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడాలని తన శరీరాన్ని దానం చేశానని, చనిపోయిన తర్వాత నిరుపయోగంగా మట్టిలో కలిసిపోవడం కంటే వైద్య పరిశోధనలకు ఉపయోగపడటం మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కల్పన, డాక్టర్ సంగీత, డాక్టర్ గుడిమెట్ల మోహనరావు, గుడిమెట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.