
ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, జిల్లాల మదర్ డైరీ చైర్మన్ గా తుర్కపల్లి మండలం వేల్పల్లె గ్రామానికి చెందిన గుడిపాటి మధుసూదన్ రెడ్డి శనివారం హయత్ నగర్ లోని మదర్ డైరీ కార్యాలయం వద్ద అధికారికంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియామక పత్రాన్ని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మదర్ డైరీ సంస్థను కాపాడుతూ రైతుల రైతుల పక్షాన నిలబడుతూ సంస్థను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మదర్ డైరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి, వివిధ జిల్లాల నాయకులు ,మదర్ డైరెక్టర్లు ఆలేరు వ్యవసాయ కమిటీ నూతన చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, జిల్లాల నాయకులు ,అధికారులు, పాల్గొన్నారు.