ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వండి : గూడూరు

నవతెలంగాణ- వలిగొండ రూరల్ : వెంకటాపురం, ముద్దాపురం, చిత్తాపురం, గోపరాజుపల్లి , వేములకొండ , గురునాథ్పల్లి గ్రామాలలో భారతీయ జనతా పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారం లొ  భాగంగా భువనగిరి బి జె పి ఎమ్మెల్యే అభ్యర్ధి గూడూరు నారాయణ రెడ్డి గారు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లలో పాల్గొని బి జె పి పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యే గా గెలిపించవలసిందిగా ఆయా గ్రామ ప్రజలను కోరడం జరిగింది. తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే వలిగొండ మండలాన్ని హెచ్ ఎం డి ఎ పరిధిలోకి తెచ్చి అభివృద్ధి కి కృషి చేస్తానని, వలిగొండ ప్రాంత వాసులు మూసి కాలుష్యం తో అనేక రోగాలకు గురౌతున్న కూడా స్థానిక ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి పట్టించుకోలేదని, తను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత మూసి నదిని ప్రక్షాళన చేయిస్తానని, భువనగిరి లో ఇప్పటివరకు డిగ్రీ కళాశాల ను ఏర్పాటు చెయ్యలేని ఎమ్మెల్యే  శేఖర్ రెడ్డి అని, తను గెలిచిన కొన్ని నెలల్లోనే స్వంత నిధులతో డిగ్రీ కళాశాల ను ఏర్పాటు చేయిస్తానని, భువనగిరి అసెంబ్లీ పరిధిలోనీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించుటకు ఐటి హబ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో 30 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అన్నారు, గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ద్వారా కుల వృత్తులకు పనిముట్లు పంపిణీ చేశామని, నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ ఇప్పిస్తే 79 మంది కానిస్టేబుల్స్ గా ఎంపిక అయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి బిసి ని ముఖ్యమంత్రి చేస్తానని కేంద్రం హామీ ఇచ్చిందని, బిజెపి ప్రభుత్వం లో ఉచిత విద్య వైద్యం అందిస్తుందని అన్నారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి బిజెపి ఎమ్మెల్యే గా గెలిపిస్తే భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో బి జె పి పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కర్నాటి ధనంజయ, పోతంశెట్టి రవీందర్, సి ఎన్ రెడ్డి, కిసాన్ మోర్చ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి , అసెంబ్లీ కన్వీనర్ చిక్క క్రిష్ణ, కో కన్వీనర్ రాచకొండ క్రిష్ణ, శక్తి కేంద్రం ఇంఛార్జి నర్సి రెడ్డి , పోలు నాగన్న , అభితేజ్ రెడ్డి, మహేశ్వర రెడ్డి ,కొత్త రామచందర్ ,ఆయా గ్రామల అధ్యక్షులు బూత్ అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.