– ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లను 2024-25 విద్యాసం వత్సరంలో కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ శృతి ఓజా మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో మార్చి వరకు వారు కొనసాగుతారని తెలిపారు. ఈ ఉత్వర్వులను విడుదల చేయడం పట్ల గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ హర్షం ప్రకటించారు.