గుగులోత్ శ్రీను పాడెమోసిన ప్రవీణ్ రావు 

నవతెలంగాణ – పెద్దవంగర: వడ్డెకొత్తపల్లి పరిధిలోని లచ్చిరాం తండాకు చెందిన గుగులోత్ శ్రీను (50) శనివారం చేపల వేటకు వెళ్లి, కరెంటు షాక్ ద్వారా చేపలు పట్టే యత్నంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన విషయం తెలిసిందే. శ్రీను అంతిమయాత్రలో మాజీ జెడ్పీ ఫోర్ లీడర్, మాజీ సర్పంచ్ నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు, అరుంధతి దంపతులు పాల్గొని, పాడెమోసి దహన సంస్కారాలు నిర్వహించారు. గత ఇరవై ఏళ్ళుగా తన కుటుంబంలో ఇంటి, వ్యవసాయ పనులు చేసుకుంటూ, కుటుంబ సభ్యుడిగా ఉన్నాడని వారు కన్నీటిపర్యంతమయ్యారు. శ్రీను లేని లోటు పూడ్చలేనిదన్నారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ధైర్యం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఓరుగంటి సతీష్, పెద్దవంగర గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉప్పలయ్య, ముత్తినేని శ్రీనివాస్, బానోత్ వెంకన్న, తంగెళ్లపల్లి మల్లికార్జున చారి, శేఖర్, చిలుసాని మల్లేష్, బొల్లు ఊశయ్య, ఎర్రగొర్ల రమేష్, జనార్ధన్, చట్టు యాకన్న, కేశబోయిన సుభాష్, పాక అనిల్, బీరన్న, ఉపేందర్, యుగేందర్, గణేష్, ముత్తయ్య, నెహ్రు, రాoమ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.