– మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అన్వేష్ తో కలిసి మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవి మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, జవాన్లు, వాటర్ సప్లై సిబ్బంది తో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ వర్షాకాలంలో అధిక వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉన్నందున మున్సిపల్ సిబ్బంది తీసుకోవాల్సిన తగు చర్యలపై సూచనలు ఇవ్వడం జరిగింది అని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది వార్డులలో నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలని కాలువల ద్వారా నీటిని బయటకు పంపించే విధంగా ఏర్పాటు చేయాలి అని సూచించారు. నీళ్లు నిల్వ ఉండడంతో లార్వా అభివృద్ధి చెంది డెంగ్యూ మలేరియా దోమలు వృద్ధి చెంది ప్రమాదకరమైన వ్యాధులు ప్రభలించే అవకాశం ఉన్నందున నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలు కూడా అప్రమత్తమై ఇంటి పక్కన గల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. మున్సిపల్ సిబ్బందిచే వార్డులలో సానిటేషన్ పరంగా ప్రతి మంగళవారం శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. వార్డ్ ల లో మున్సిపల్ సిబ్బందిచే ఫాగింగ్ , యాంటీ లార్వా స్ప్రే చేపిస్తున్నామని రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నామని వారన్నారు.వర్షాలు పడుతున్నందున శిథిలావస్థలో ఉన్న ఇంటిలో ఎవరు నివసించే రాదని కరెంట్ స్తంభాలు కు దూరంగా ఉండాలని ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే కౌన్సిలర్ దృష్టికి గాని, అధికారుల దృష్టికి గాని మా దృష్టికి గాని తీసుకరావాలని అన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారన్నారు.సిబ్బంది కూడా విదుల పట్ల అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వార్డులలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సానిటేషన్ పరంగా తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, వార్డ్ ఆఫీసర్లు, జవాన్లు, వాటర్ సప్లై సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.