
నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని బిజెపి పట్టణ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్ ఓటర్లకు సూచించారు. సోమవారం స్థానిక జడ్పీ హైస్కూల్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఓటింగ్ పోలింగ్లో భాగంగా స్థానిక చౌరస్తాలో బిజెపి కౌంటర్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నుండి వచ్చే ఓటర్లకు, స్థానిక ఓటర్లకు ఓటర్ స్లిప్పులు , ఏ బూతు ఎక్కడ ఉందో, సమాచారాన్ని తెలియజేశారు. ఈ ఎన్నికల్లో ప్రేమందర్ రెడ్డి గెలుపు కనబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కోమటి వీరేశం,సముద్రాల వెంకటేశ్వర్లు, కాసాల జనార్దన్ రెడ్డి, సోమ నరసింహ,తడకమల్ల శ్రీధర్, బోడ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.