– ఫిడె క్యాండిడేట్స్ టెస్
టోరంటో (యుఎస్‌ఏ) : భారత గ్రాండ్‌మాస్టర్ డి. గుకేశ్ ఫిడె క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. గత రౌండ్ల నైరాశ్యం నుంచి వేగంగా బయటపడిన గుకేశ్.. ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్ మ్యాచ్‌లో సహచర గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతిపై గెలుపొందాడు. టూ నైట్స్ డిఫెన్స్‌లో 38 ఎత్తుల్లోనే విదిత్‌పై గుకేశ్ గెలుపొందాడు. మరో కీలక మ్యాచ్‌లో ఆర్. ప్రజ్ఞానంద 40 ఎత్తుల్లో అలిరెజా (ఫ్రాన్స్)తో డ్రా చేసుకున్నాడు. ఫాబియానో (యుఎస్‌ఏ)పై హికరు నకమురు (యుఎస్‌ఏ) గెలుపొందగా.. ఐయాన్, నిజత్ మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఎనిమిది రౌండ్ల అనంతరం ఐయాన్ (రష్యా)తో కలిసి గుకేశ్ (5.0) అగ్రస్థానంలో నిలువగా.. ప్రజ్ఞానంద (4.5) నాల్గో స్థానంలో నిలిచాడు. విదిత్ గుజరాతి (3.5) ఆరో స్థానంలో ఉన్నాడు. మహిళల విభాగంలో కోనేరు హంపీ (3.5), ఆర్. వైశాలి (2.5) వరుసగా ఆరు, ఎనిమిదో స్థానాల్లో కొనసాగుతున్నారు.