
గల్ఫ్ వలస కార్మికుల బాధలు తెలుసుకునేందుకు దుబాయ్ కి వెళ్ళిన తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ ఈరవత్రి అనిల్ ను బాల్కొండ నియోజకవర్గానికి చెందిన గల్ఫ్ వలస కార్మికులు ఆడేం ప్రతాప్ ముదిరాజ్ (తాళ్ళ రాంపూర్),రఘు(తిమ్మాపూర్) , సతీష్(మెండోరా) ,సురేష్ కాసర్ల కలిసి గల్ఫ్ కార్మికులు అనుభవిస్తున్న సాధక,బాధకాలను వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గల్ఫ్ వలస కార్మికుల కోసం జీఓ నంబర్ 21 ని తీసుకువచ్చిందని,దీని ప్రకారం గల్ఫ్ లో మరణించిన కార్మికులకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడం హర్షించదగ్గ విషయమని అన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి,ఉపముఖ్యమంత్రి మల్లు బట్టివిక్రమార్కకు,ఈరవత్రి అనిల్ కు ,ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.గల్ఫ్ వలస కార్మికులకు కాంగ్రెస్ పార్టీ,రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈరవత్రి అనిల్ ప్రభుత్వం తరపున హామీని ఇవ్వడం సంతోషం కలిగించిందని,గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలకు జీఓ నంబర్ 21 ఎంతగానో ఉపయోగపడుతుందని వారు అన్నారు.