ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు వంటి పథకాలకు సంబంధించి గ్రామ సభల్లో ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు లేకుండా అన్ని అర్హతలు ఉన్న గల్ఫ్ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలనీ గల్ఫ్ సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కలెడ భూమన్న అన్నారు., వలస వెళ్లిన గల్ఫ్ కార్మికులకు నష్టం కలిగించే వద్దని అధికారులను ప్రభుత్వానికి కోరుతున్నా మన్నారు దేశానికి రాష్ట్రానికి విలువైన విదేశీ కరెన్సీని అందిస్తూ దేశాన్నికి రక్షణ కవచ్చంగా వున్న మా గల్ఫ్ కార్మికులు లన్నారు అయితే, వలస కారణంగా గ్రామాలలో వారి పేర్లు ప్రభుత్వ డేటాలో లేకుండా పోవడంతో ఇల్లు, రేషన్ కార్డులు, మరియు ఇతర సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత కోల్పోతున్నారు అని రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాల్లో అవకాశం కలిపిచాలని వారు అన్నారు. తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి తరపున రాష్ట్ర ప్రభుత్వనికి ఆవేదన ఏమనగా గల్ఫ్ కార్మికులకు ఈ పథకాలలో ప్రత్యేక మినహాయింపు కల్పించాలి. వారి వలస జీవితం కారణంగా వారికి వచ్చే నష్టాలను పూడ్చడానికి ప్రత్యేకమైన ఆడిట్ నిర్వహించాలి. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలలో గల్ఫ్ కార్మికులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూన్నాం అని వారు అన్నారు.