‘క్లూ’, ‘మంచి కాఫీ లాంటి కథ’ వంటి షార్ట్ ఫిలిమ్స్‌లో నటించిన సంజరు శ్రీ రాజ్‌ను హీరోగా, ప్రియ శ్రీనివాస్‌ని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న సినిమా ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’.
‘మే 16’ అనే ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించిన సంస్థ ఏ బి డి ప్రొడక్షన్స్ మరో అడుగు ముందుకు వేస్తూ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు ఆపిల్ మ్యూజిక్, స్పోటిఫై, అమెజాన్ మ్యూజిక్, రిసో ప్లేయర్, హుంగమ, జియో సావన్, గాన యుట్యూబ్ మ్యూజిక్ తదితర మాధ్యమాలల్లో అందరినీ అలరిస్తున్నాయి. ఈ చిత్రంలోని ‘భోలో శంకరా’ పాటకి విశేష ఆదరణ లభించింది. దర్శకుడు ధర్మ మాట్లాడుతూ, ‘ఈ సినిమాని నెల్లూరులో షూట్ చేశాం. ఒక గల్లీలో నివసించే అనాథలు, వాళ్ళు ఎదుర్కొనే సంఘటనల సమాహారం ఈ సినిమా’ అని చెప్పారు. ‘ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ- ఎడిటింగ్- డి ఐ- దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలుతో పాటు కథలో కూడా ధర్మ పాత్ర ఎంతో ఉంది’ అని డైరెక్టర్ వెంకటేష్ కొండిపోగు అన్నారు. ప్రొడ్యూసర్ డా. ఆరవేటి యశోవర్ధన్ మాట్లాడుతూ, ‘క్రైమ్ డ్రామా చుట్టూ జరుగుతుంది. అని ఇందులో నాలుగు ముఖ్య పాత్రలైన అనాథలు, వాళ్ళ జీవితాల చుట్టూ కథ తిరుగుతుంది. ఈనెల 26న సినిమాని రిలీజ్ చేస్తున్నాం’ అని తెలిపారు.