సాంస్కృతిక సారధిగా గుమ్మడి వెన్నెల

– ప్రభుత్వం ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ సాంస్కృతిక సారధిగా దివంగత ప్రజా కళాకారుడు, గద్దర్‌ కూతురు గుమ్మడి వెన్నెలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ శనివారం జీవో నెంబర్‌ 228 విడుదల చేశారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాలు, పథకాల సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు తెలంగాణ చారిత్రక, సాంస్కృతికతను చాటి చెప్పేందుకు సారధి కృషి చేస్తుందని పేర్కొన్నారు.