
జన్నారం మండలంలోని కొత్తపేట గిరిజన గ్రామంలో సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శిగా మడావి గుమ్మును నియమించినట్లు పార్టీ మండల నాయకులు కొండ గొర్ల లింగన్న, అంబటి లక్ష్మణ్ తెలిపారు. గురువారం గ్రామంలో సీపీఐ(ఎం) మహాసభలు నిర్వహించారు. గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి వివరిస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.