నవతెలంగాణ – తొగుట
పేరు లో గాంధీ పెట్టుకొని గుండాగిరీ చేస్తున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తదితరుల అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ కు వెళ్ళడానికి సిద్దమైన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డు కొని తొగుట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ హయాంలో ధర్నా చౌక్ ఎత్తేస్తే వ్యాంగ్యంగా మాట్లా డిన రేవంత్ రెడ్డి నేడు ప్రజాస్వామ్యంను ఖునీ చేశాడన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గా గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ప్రజా పద్దుల చైర్మన్ పదవిని అరికపూడి గాంధీ కి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని గాంధీ చెప్పడం సిగ్గుచేటన్నారు. పాడి కౌశిక్ ను హౌస్ అరెస్ట్ చేసి న పోలీసులు అరికపూడి గాంధీ, అయన అనుచ రులను స్వేచ్ఛగా ఎమ్మెల్యే పై దాడి చేసేలా సహ కరించారని ఆరోపించారు. గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే తెలంగాణ భవన్ కు రావాలని, రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నా రని విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తో సహా ఎమ్మెల్యే లను, బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడంపై తీవ్రంగా ఖండించారు.. హరీష్ రావు గాయపడ్డా దౌర్జన్యంగా తీసుకెళ్లడం వారి ఆరాచకానికి నిదర్శనమన్నారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, పాక్స్ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, మండల యూత్ అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్, నాయకులు ఎం చంద్రారెడ్డి, సుతారి రమేష్, శ్రీనివాస్ గౌడ్, మల్లేశం, చిప్ప నర్సింహులు తదితరులు ఉన్నారు.