ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా గుండె రఘుపతి

నవతెలంగాణ – రాయపర్తి
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన గుండె రఘుపతిని నియమించినట్లు ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నగరగిరి ప్రిథం, జిల్లా అధ్యక్షుడు నరుకుడు వెంకటయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన ఎస్సీ సెల్ నాయకులకు, స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి, నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డికి, నాయకులకు  కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కృషి చేస్తా అన్నారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు పని చేస్తా అని తెలిపారు. కన్నతల్లి వంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తా అన్నారు. ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.