సేవ చేయడంలో ఎంతో సంతృప్తిగా ఉంటుందని గురప్ప గారి శేష్ కుమార్అన్నారు. మంగళవారం మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో అంగన్వాడి కేంద్రాల్లోకు విద్యార్థులకు సిరిసాపలను అంగన్వాడి కేంద్రాలకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి భారత పౌరులుగా ఎదగాలని అన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఆర్థిక అభివృద్ధి చెందాలని అన్నారు. గ్రామంలో ఎలాంటి విద్యార్థులకు ఏది అవసరమైన ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు. సేవ చేయడం పట్ల ఎంతో సంతృప్తిగా ఉంటుందని ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎనగంటి కిష్టయ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్ రేఖ, వార్డు మెంబర్ నిరుటి రాజు గున్నమ్మగారి ప్రసాద్ మధు నిఖిల్ నవీన్ శ్రీనివాస్ సత్తయ్య, అంగన్వాడి ఉపాధ్యాయురాలు విజయ రమాదేవి, షబానా, షఫియా తదితరులు పాల్గొన్నారు.