గురువు పోచారం పార్టీ మారారు.. ఇక శిష్యుడు హనుమంతు సిండే దారేటో

– జుక్కల్ నియోజకవర్గంలో మొదలైన చర్చలు
నవతెలంగాణ – మద్నూర్
బీఆర్ఎస్ పార్టీ అధినేత రెండుసార్లు అధికారాన్ని చేపడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో కేసీఆర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి లక్ష్మి పుత్రుడుగా భావించేవారు. అలాంటి లక్ష్మీ పుత్రుడు కేసీఆర్ పార్టీని వదులుకొని, కాంగ్రెస్ పార్టీలో చేరారు. లక్ష్మి పుత్రుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వదులుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇక జుక్కల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి శిష్యుడు అనుమంతు సిండే దారేటో అనే చర్చలు జుక్కల్ నియోజకవర్గం లో మొదలయ్యాయి. లక్ష్మి పుత్రుడు గురువే లేనప్పుడు శిష్యుడు ఏమి చేయగలడనే చర్చలు నియోజకవర్గ ప్రజల్లో జోరుగా వినిపిస్తున్నాయి. లక్ష్మి పుత్రుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కి ముఖ్య శిష్యుడైన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు సిండేను కూడా కాంగ్రెస్ వైపు మలుపుకుంటారేమోనని చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి. గురువు పార్టీ మారడం శిష్యుడైన హనుమంతు షిండే డైలామాలో పడ్డట్లు చర్చలు జరుగుతున్నాయి.
షిండే కూడా పార్టీ మారుతారా లేక బిఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉంటారా ప్రజల్లో చర్చలు మొదలయ్యాయి. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే దిశలో కనబడుతుంది. ఎందుకంటే ఆ పార్టీలోని అతి ముఖ్యమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం.. ఆ పార్టీకి మనుగడ లేక పోతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రస్తుతం జుక్కల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు హనుమంతు షిండే పరిస్థితి ఏమిటనే చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే లక్ష్మి పుత్రునికి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించుకొని పార్టీలో చేర్చుకుంది. లక్ష్మి పుత్రుడైన గురువు పార్టీని మారడం శిష్యుడు హనుమంతు షిండే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుండగా బలమైన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండలేక పోతుంది. గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎమ్మెల్యేలే వెళ్లిపోతుంటే ఇక మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి కట్టుబడి ఎలా పనిచేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంతు షిండే పార్టీని మారి గురువు వెంట వెళ్తారా.. లేక తల్లి లాంటి పార్టీని వదలకుండా కట్టుబడి బీఆర్ఎస్ పార్టీకి బలోపేతం చేస్తారా నియోజకవర్గ ప్రజల్లో జోరుగా చర్చలు వినిపిస్తున్నాయి.