శ్రీ షిరిడి సాయి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు

Guru Poornami Celebrations at Sri Shirdi Sai Templeనవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని  ఉప్లూర్ లో శ్రీ షిరిడి సాయి ఆలయంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలను ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమిని పురస్కరించుకొని బాబా విగ్రహానికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణభిషేకం, విశేషపంచామృత అభిషేకము, కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ బాబా ఉత్సవ విగ్రహంతో పల్లకి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ స్వర్గీయ గడ్డం విద్యాసాగర్ రెడ్డి-పద్మావతి గారి కుమారుడు గడ్డం రాజేష్ రెడ్డి సహకారంతో ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు నందగిరి దయానంద్, పోలేపల్లి లచ్చయ్య, బద్దం గంగారెడ్డి, యెనుగందుల శశిధర్, పసుపుల రాజేందర్, పోతు మురళి, పోతు గణేష్, పెంబర్తి నరేష్ కుమార్, సాయి భక్తులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.